హేమ డ్రగ్స్ తీసుకుంది – ఛార్జ్ షీట్ లో పేర్కొన్న బెంగళూరు పోలీసులు

రేవ్ పార్టీ(Rave party)లో నటి హేమ(Hema) డ్రగ్స్ తీసుకుందని బెంగళూరు పోలీసులు(Bengalore police) తమ విచారణలో తేల్చారు. ఈ మేరకు ఇన్వెస్టిగేషన్ చేసి తయారు చేసిన ఛార్జ్ షీట్ లో హేమ పేరును చేర్చారు. వెయ్యికి పైగా పేజీలతో సమగ్రంగా ఛార్జ్ షీట్ తయారుచేశారు బెంగళూరు పోలీసులు. ఇందులో మొత్తం 88 మంది పేర్లు చేర్చారు. వారిలో హేమ కూడా ఒకరు.

హేమ ఈ రేవ్ పార్టీలో ఎండీఎంఏ అనే డ్రగ్ తీసుకున్నట్లు తమ ఇన్వెస్టిగేషన్ లో తేల్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆధారాలు చూపించేందుకు పోలీసులు నిందితుల మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జ్ షీట్ తో పాటు జతచేశారు. ఈ ఛార్జ్ షీట్ అంశంపై టీవీ ఛానెళ్లతో హేమ మాట్లాడింది. పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్లు తాను ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకోలేదని చెప్పింది. ఛార్జ్ షీట్ తన చేతికి వచ్చాక స్పందిస్తాని హేమ తెలిపింది. హేమ రేవ్ పార్టీ వ్యవహారం కొద్ది రోజులు ఇండస్ట్రీలో, మీడియాలో టాపిక్ అయ్యింది.