ఏపీలోనూ “దేవర”కు బెన్ ఫిట్ షోస్

ఎన్టీఆర్(NTR) హీరోగా నటిస్తున్న దేవర(Devara) సినిమా ఈ నెల 27న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమాకు అదనపు షోస్, టికెట్ రేట్ల పెంపునకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ఇప్పుడు ఏపీ()లోనూ బెన్ ఫిట్ షోస్, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం.

27వ తేదీన అర్థరాత్రి షోస్ తో పాటు 28వ తేదీ నుంచి రోజుకు ఐదు షోస్ చొప్పున దేవర ప్రదర్శనలు చేసుకోవచ్చని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ లో బాల్కనీకి 110, లోవర్ క్లాస్ లో 60 రూపాయల వరకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్ లలో 135 రూపాయల వరకు రేట్ల పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. దేవర బెన్ ఫిట్ షోస్, టికెట్ ప్రైస్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చినందుకు ఏపీ ప్రభుత్వానికి హీరో ఎన్టీఆర్, నిర్మాత కల్యాణ్ రామ్ కృతజ్ఞతలు తెలిపారు.