“ఆర్టిస్ట్” సినిమా నుంచి మెలొడీ సాంగ్ ‘ఓ ప్రేమ ప్రేమ…’ రిలీజ్

“ఆర్టిస్ట్” మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన చూస్తూ చూస్తూ సాంగ్ కు ఆదరణ దక్కగా..ఇప్పుడు మరో మంచి పాటను మ్యూజిక్ లవర్స్ ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఓ ప్రేమ ప్రేమ అంటూ సాగే బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ ను తాజాగా విడుదల చేశారు. ఈ పాట ఇన్ స్టంట్ గా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.

‘ఓ ప్రేమ ప్రేమ..’ పాటను మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా.. రాంబాబు గోసాల మంచి లిరిక్స్ అందించారు. రమ్య బెహర ఆకట్టుకునేలా పాడారు. ‘ఓ ప్రేమ ప్రేమ..’ పాట ఎలా ఉందో చూస్తే… జారే కన్నీరే అడుగుతుందా ..నేరం ఏముందో చెప్పమంటూ.. నా ప్రేమే ఇలా ఓ ప్రశ్నయ్యేనా ..నా మౌనం ఇలా ఈ బదులిచ్చేనా..అంటూ హార్ట్ టచింగ్ గా సాగుతుందీ పాట.

సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా “ఆర్టిస్ట్”. ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. వినూత్నమైన ప్రేమ కథతో తెరకెక్కుతున్న “ఆర్టిస్ట్” మూవీ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.