సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు హీరో విజయ్ దేవరకొండ. ఈ మేరకు ఆయన ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. తన స్నేహితుని విషయంలో ఒకసారి ఇలాంటి మోసం జరిగిందని విజయ్ గుర్తు చేశారు. విజయ్ దేవరకొండ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు విజయ్ తనవంతు ప్రయత్నం చేస్తున్నారంటూ నెటిజన్స్ అభినందిస్తున్నారు.
మీ స్నేహితులం అంటూ కొందరు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు వారికి మేము ఇడియట్స్ కాదు అని చెప్పండి అంటూ వీడియోలో విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. మిమ్మల్ని డబ్బులు అడిగితే ఇవ్వకండి, మీకు డబ్బులు పంపామంటూ మెసేజ్ లు పంపినా బ్యాంక్ ద్వారా మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి అని పేర్కొన్నారు.