నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలిసి చేస్తున్న మూవీ భగవంత్ కేసరి. ఈ చిత్రంలో బాలయ్యకు జంటగా కాజల్ నటిస్తుంటే.. కూతురుగా శ్రీలీల నటిస్తుంది. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి భగవంత్ కేసరి పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేస్తున్నామని గతంలో ప్రకటించారు. ఇప్పుడు దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. అక్టోబర్ 19నే కోలీవుడ్ స్టార్ విజయ్ లియో సినిమా విడుదల కానుంది.
ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ డైరెక్టర్. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. విచిత్రం ఏంటంటే.. సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థే బాలయ్య, బాబీ కాంబో మూవీని నిర్మిస్తుంది. ఈ రెండు సినిమాలు ఒకేరోజున వస్తుంటే.. రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా దసరాకి వస్తుందని ప్రకటించారు. అయితే.. పక్కగా దసరాకి వస్తుందా..? వాయిదా పడుతుందా..? అనేది క్లారిటీ రావాల్సివుంది. దసరాకి రెండు సినిమాలు పోటీపడితే ఫరవాలేదు కానీ.. మూడు సినిమాలు పోటీపడితే మాత్రం కష్టమే. మరి.. దసరా పోటీ ఎలా ఉంటుందో.. ఏ సినిమాల మధ్య ఉంటుందో చూడాలి.