సంక్రాంతి బరిలోకి.. బాలయ్య..?

నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో భగవంత్ కేసరి సినిమా రూపొందుతుంది. ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ నటిస్తుంటే.. కూతురుగా శ్రీలీల నటిస్తుంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది. దసరాకి ఈ భగవంత్ కేసరి చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించడం ఖాయం అని టాక్ బలంగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల బాలయ్య 109వ చిత్రాన్ని స్టార్ట్ చేశారు. ఈ చిత్రానికి బాబీ డైరెక్టర్. కథ విన్న సింగిల్ సిట్టింగ్ లోనే సినిమా ఫిక్స్ చేసుకున్నారట.

త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న బాలకృష్ణ 109వ సినిమాను మూడు లేదా నాలుగు నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. అంతేకాదు కుదిరితే మళ్లీ సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సంక్రాంతికి బాలకృష్ణ సినిమా వస్తే ఫ్యాన్స్ కి పండుగే. ఈ ఇయర్ సంక్రాంతికి వీరసింహా రెడ్డి అంటూ వచ్చి బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మ్రోగించాడు. బాలకృష్ణ. బాబీ డైరెక్షన్ లో సినిమాను కూడా సంక్రాంతి రిలీజ్ టార్గెట్ పెడుతున్నట్టు టాక్. అయితే ఆల్రెడీ సంక్రాంతికి మహేష్ గుంటూరు కారం ప్రభాస్ ప్రాజెక్ట్ K రవితేజ ఈగల్ సినిమాలు ఖర్చీఫ్ వేశారు. మహేష్‌ గుంటూరు కారం సంక్రాంతికి వస్తుందా..? వాయిదా పడుతుందా..? అనేది సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా ఇప్పుడు బాలయ్య కూడా వస్తానంటే మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఫైట్ మరింత టఫ్ గా మారుతుంది. అయితే.. బాలయ్య సంక్రాంతికి రావడం కుదరకపోతే.. సమ్మర్ కి వచ్చే ఛాన్స్ ఉంది.