నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ సాధించడం తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబో మూవీ అంటే బ్లాక్ బస్టర్ ఖాయం అనే టాక్ ఉంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి కాంబోలో మూవీ అంటూ ప్రచారం జరిగింది. బాలయ్య పుట్టినరోజున ఈ చిత్రాన్ని ప్రకటిస్తారని అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో లేదని తెలిసింది. ఇది నందమూరి అభిమానులకు కాస్త షాకింగ్ గా అనిపించినా నిజంగా నిజం అని సమాచారం.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఆగష్టుకి బోయపాటి రామ్ తో చేస్తున్న మూవీ కంప్లీట్ అవుతుంది. అలాగే బాలయ్య కూడా అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీ ఆగష్టుకు పూర్తవుతుంది. ఆ వెంటనే సినిమా చేసి డిసెంబర్ కి కంప్లీట్ చేయమని బోయపాటిని అడిగితే… మూడు నెలల్లో సినిమా కంప్లీట్ చేయడం సాధ్యం కాదని చెప్పాడట. అందుచేత బాలయ్య, బోయపాటి కాంబో మూవీ 2024 ఎన్నికల తర్వాత ఉంటుందని సమాచారం. అయితే.. ఆగష్టులో స్టార్ట్ చేసి డిసెంబర్ కి కంప్లీట్ చేయడానికి బాబీ ఓకే చెప్పడంతో బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.