బిగ్ బాస్ అంటే అందరికీ గుర్తొచ్చేది కింగ్ నాగార్జున. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ చేయగా.. సెకండ్ సీజన్ నాని చేశాడు. ఇక బిగ్ బాస్ థర్డ్ సీజన్ నుంచి ఎనిమిదవ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా చేయడం విశేషం. తాజాగా బిగ్ బాస్ 9 వార్తల్లోకి వచ్చింది. ఈ సీజన్ ను జులై నుంచి స్టార్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది కానీ..సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ 9 స్టార్ట్ కానుందని తెలిసింది. దీనికి సంబంధించి ఆల్రెడీ కసరత్తు స్టార్ట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది.
బిగ్ బాస్ 9 కు హోస్ట్ గా బాలకృష్ణ చేయనున్నారని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. నాగార్జున ప్రస్తుతం నటించిన కూలీ, కుబేర చిత్రాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఇక సోలో హీరోగా కొన్ని ప్రాజెక్ట్ కు ప్లాన్ చేస్తున్నాడు నాగార్జున. అందుకే బిగ్ బాస్ 9 చేసేందుకు టైమ్ కుదరకపోవచ్చు అని చెప్పాడట నాగ్. దీంతో స్టార్ మా యాజమాన్యం బాలకృష్ణను కాంటాక్ట్ చేశారట. అంతా కుదిరితే బిగ్ బాస్ 9 కు బాలకృష్ణ హోస్ట్ కాబోతున్నారు.