సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ కు సరైన టైమ్ లో సక్సెస్ అందించిన సినిమా జైలర్. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యారు. ఇటీవల ఈ మూవీకి సీక్వెల్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంతే కాకుండా స్పెషల్ వీడియోతో అనౌన్స్ చేయడం..ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. దీంతో జైలర్ 2 పై మరింత క్రేజ్ పెరిగింది.
జైలర్ 2 లో బాలకృష్ణ నటించనున్నట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు కొత్తగా సూర్య పేరు వినిపిస్తోంది. జైలర్ ఫస్ట్ పార్ట్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ లో నటించి మెప్పించారు. జైలర్ 2 లో బాలకృష్ణ, సూర్య ఇద్దరూ నటిస్తున్నారట. ఈసారి అంతకుమించి అనేలా ఉండాలనే ఉద్దేశ్యంతో బాలకృష్ణను రంగంలోకి దింపనున్నట్టుగా టాక్ వచ్చింది. బాలకృష్ణ పాజిటివ్ క్యారెక్టర్ లో, సూర్య గ్రే షేడ్ ఉన్న మరో డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నాడని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.