బాలకృష్ణ – హరీశ్ శంకర్ కాంబో ఫిక్స్

బాలకృష్ణ సంక్రాంతికి డాకు మహారాజ్ మూవీతో వస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ అఖండ 2 చేయనున్నారు. మరోవైపు బాలకృష్ణతో సినిమా చేయడానికి డైరెక్టర్ హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. ఎప్పటి నుంచో హరీష్ శంకర్ బాలకృష్ణ సినిమా చేయాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఫిక్స్ అయ్యిందని సమాచారం. ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు దర్శకుడు హరీష్ శంకర్ ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా ఇప్పట్లో షూటింగ్ జరుపుకోవడం కష్టంగా కనిపిస్తుంది. దీంతో ఈ డైరెక్టర్ ఇప్పుడు బాలకృష్ణతో మూవీ ప్లాన్ చేస్తున్నాడని వినిపిస్తోంది. ఆల్రెడీ స్టోరీ బాలకృష్ణకు చెప్పడం ఆయన ఓకే అనడం జరిగిందని సమాచారం. ప్రస్తుతం హరీష్ శంకర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట. త్వరలో ఈ మూవీకి సంబంధించి అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలిసింది.