బలగం చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. అంతే కాకుండా.. ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుంది. పల్లెటూరుల్లో ఈ సినిమాని విపరీతంగా చేశారంటే ఈ సినిమా జనాలకు ఎంతగా నచ్చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాతో కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే మంచి పేరుతో పాటు అవార్డులు దక్కించుకున్నాడు. బలగం చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. తన నెక్ట్స్ మూవీని కూడా దిల్ రాజు బ్యానర్ లోనే అని వేణు ఆమధ్య ఓ ఇంటర్ వ్యూలో చెప్పాడు.
అయితే.. ఎవరితో సినిమా చేయనున్నాడు..? ఏ తరహా కథతో సినిమా చేయనున్నాడు..? అనేది ప్రకటించలేదు. ఇప్పుడు తన తదుపరి చిత్రానికి స్ర్కిప్ట్ వర్క్ స్టార్ట్ అయ్యిందని తెలియచేస్తూ.. సోషల్ మీడియాలో పేపర్, పెన్ తో పోస్ట్ చేశాడు. ఆ పేపర్ పై శ్రీఆంజనేయం అని రాశాడు. అయితే.. ఎలాంటి కథతో సినిమా చేయనున్నాడు అనే వివరాలు తెలియాల్సివుంది. కాకపోతే ఈసారి వేణు పెద్ద కథతోనే సినిమా చేస్తాడని.. ఆల్రెడీ లైన్ చెప్పాడని దిల్ రాజు ఆమధ్య ప్రకటించాడు. మరి.. వేణు ఈసారి రెండో ప్రయత్నంలో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.
Started…..#2✌🏼#Cinema #writing pic.twitter.com/PTpl7lmKDh
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) June 19, 2023