అన్ని భాషల్లో బేబి రీమేక్ కానుందా..?

బేబి చిన్న సినిమాగా రిలీజైంది. ఊహించని విధంగా పెద్ద విజయం సాధించింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలు పోషించిన ఈ చిత్రానికి సాయిరాజేష్ డైరెక్టర్. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఆతర్వాత రోజురోజకు కలెక్షన్స్ పెంచుకుంటూ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పటి వరకు 70 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. వర్షాలు పడుతున్నా కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు. ఫుల్ రన్ లో 100 కోట్ల మార్క్ ను దాటనుందని సినీ పండితులు అంటున్నారు. ఇప్పుడు బేబి పై వేరే భాషల ఫిల్మ్ మేకర్స్ దృష్టి పడింది.

రీమేక్ చేసేందుకు భారీ ఆఫర్స్ ఇస్తున్నారు. కోలీవుడ్, బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయని తెలిసింది. రీమేక్ రైట్స్ ఇస్తే చాలు లాభాల్లో 50 శాతం వాటా ఇస్తామంటూ బేరాలు తీసుకొస్తున్నారట. నిజానికి ఇది చాలా మంచి ఆఫరే. చేతి నుంచి చిల్లి గ‌వ్వ పెట్టాల్సిన ప‌ని లేదు. కొడితే… ఏనుగు కుంభ‌స్థ‌లాన్ని కొట్టేయొచ్చు. అందుకే బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ ఈ దిశ‌గా ప్ర‌ణాళిక‌లు వేసుకొంటున్నారని టాక్ వినిపిస్తోంది. తమిళ్, హిందీతో పాటు మిగిలిన భాషల్లో కూడా రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి బేబి ఊహించని విజయం సాధించి సంచలనం సృష్టించింది.