టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించారు. బాక్సాఫీస్ వద్ద దాదాపు 95 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిందీ సినిమా. ఇటీవల ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ సినిమా డిజిటల్ వేదిక మీదా సూపర్ సక్సెస్ అయ్యింది. 32 గంటల్లో 100 ఫ్లస్ మిలియన్ మినిట్స్ వ్యూస్ దక్కించుకుంది.
ఇలా బిగ్ స్క్రీన్, ఓటీటీలో రికార్డ్ క్రియేట్ చేసిన బేబి మూవీ హిందీలో రీమేక్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్కేఎన్ నిర్మించారు. బేబి సినిమాలోని యూత్ ఫుల్, లవ్ ఎలిమెంట్స్ ఉత్తరాది ప్రేక్షకులకు బాగా నచ్చుతాయని అంచనాలు ఏర్పడుతున్నాయి. బేబి హిందీ రీమేక్ గురించి మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించాల్సిఉంది.