ఆహా ఓటీటీలో “బేబి” రికార్డ్

థియేటర్ లో సెన్సేషన్ సృష్టించిన బేబి అదే సక్సెస్ ను ఓటీటీలోనూ కొనసాగిస్తోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ బేబి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా జస్ట్ 32 అవర్స్ లో 100 ఫ్లస్ మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ తెచ్చుకుంది కొత్త రికార్డ్ సృష్టించింది. ఇది ఓటీటీలో అరుదైన రికార్డ్ గా చెబుతున్నారు. యూత్ ఆడియెన్స్ లోకి బేబికున్న క్రేజ్ ఈ రికార్డ్ తో వెల్లడవుతోంది.

మాస్ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమాను రూపొందించారు. బేబి సినిమా ఎమోషన్, లవ్, యూత్ ఫుల్ అంశాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలయ్యాక మెగాస్టార్ నుంచి అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ బెస్ట్ విశెస్, అప్రిషియేషన్స్ అందుకుంది. తెలుగు తెరపై ఓ కల్ట్ లవ్ స్టోరిగా మారింది. బేబి రానున్న రోజుల్లో ఓటీటీలో ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో చూడాలి.