ఈటీవీ విన్ లోకి రాబోతున్న అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ముత్తయ్య

జీవితంలో కోరుకున్నది సాధించేందుకు వయసు అడ్డు కాదు. ఏ వయసులోనైనా మన కలను సాకారం చేసుకోవచ్చనే స్ఫూర్తిని నింపేలా రూపొందిన సినిమా ముత్తయ్య. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు ప్రెస్టీజియస్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడి, పలు ప్రతిష్టాత్మ అవార్డ్స్ పొందిందీ సినిమా. ఈ అవార్డు విన్నింగ్ మూవీ త్వరలో ఈటీవీ విన్ లో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. సినిమాల్లో నటించాలనే కలగనే 70 ఏళ్లు వృద్ధుడు తన కలను నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో అడ్డంకులు అధిగమించిన నటుడిగా ఎలా మారాడు అనే కథాంశంతో ముత్తయ్య రూపొందింది.

ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దివాకర్ మణి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మరియు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. బాలగం, బాపు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.