థ్రిల్లింగ్ లవ్ స్టోరీ మూవీగా “28°C” ఆకట్టుకుంటుందని అంటున్నారు యంగ్ ప్రొడ్యూసర్ సాయి అభిషేక్. థియేట్రికల్ గా ఎక్సిపీరియన్స్ చేయాల్సిన చిత్రమిదని, అందుకే ఓటీటీలో ఆఫర్స్ ఉన్నా రిలీజ్ చేయలేదని ఆయన చెబుతున్నారు. “28°C” సినిమాను పొలిమేర ఫేమ్ దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ రూపొందించగా..నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా నటించారు. ఈ నెల 4న “28°C” సినిమా రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ తన ఇంటర్వ్యూలో తెలిపారు ప్రొడ్యూసర్ సాయి అభిషేక్.
నిర్మాత సాయి అభిషేక్ మాట్లాడుతూ – “28°C” అనే టెంపరేచర్ పాయింట్ తో అనిల్ విశ్వనాథ్ చెప్పిన కథ ఇంప్రెస్ చేసింది. ప్రేక్షకులకు కూడా ఇది కొత్త అనుభూతిని ఇస్తుందనే నమ్మకంతో మూవీ స్టార్ట్ చేశాం. 2019లోనే “28°C”మూవీ రెడీ అయ్యింది. 2020 మేలో రిలీజ్ చేయాలని అనుకున్నాం. కరోనా పాండమిక్ వల్ల థియేటర్స్ లో రిలీజ్ చేయడం కుదరలేదు. ఓటీటీ ఆఫర్స్ వచ్చినా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని పట్టుదలగా వెయిట్ చేశాం. “28°C” టెంపరేచర్ లో హీరోయిన్ ఉండాల్సిన హెల్త్ కండీషన్ ఏర్పడుతుంది. ఆ టెంపరేచర్ దాటితో ఆమెకు ప్రాణాపాయం. అలాంటి పరిస్థితిని ఈ జంట ఎలా ఎదుర్కొన్నారు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఆద్యంతం ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేలా మూవీ రూపొందించాడు. కంటెంట్ మీద నమ్మకంతో ఇప్పటిదాకా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ప్రేక్షకులు థియేటర్స్ లో మా సినిమాకు మంచి రెస్పాన్స్ ఇస్తారనే ఆశిస్తున్నాం. అన్నారు