ఇప్పటిదాకా తెరపై చూడని కొత్త కాన్సెప్ట్ “28°C”మూవీలో చూస్తారు – డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

బాడీ టెంపరేచర్ ఒక సినిమాకు కీ పాయింట్ కావడం ఫస్ట్ టైమ్ ఇన్ మూవీ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటిదాకా ప్రేక్షకులు తెరపై చూడలేదు. ఇలాంటి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తో “28°C” సినిమా రూపొందించారు దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్. పొలిమేర సిరీస్ లో రెండు చిత్రాలతో థ్రిల్ కు గురిచేసిన ఈ డైరెక్టర్ “28°C” లాంటి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చేయడం విశేషం. ఇది ఆయనకు పస్ట్ మూవీ. నవీన్ చంద్ర, శాలినీ వడ్నికట్టి జంటగా నటించిన “28°C” సినిమా ఏప్రిల్ 4న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ చిత్ర విశేషాలను ఈ రోజు ఇంటర్వ్యూలో తెలిపారు డైరెక్టర్.

డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ – “28°C” సినిమాను 2017లో స్టార్ట్ చేశాం. 2020 మేలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. మార్చి లో లాక్ డౌన్ వచ్చి మూవీ పోస్ట్ పోన్ అయ్యింది. ఆ తర్వాత అనేక అనివార్య కారణాలతో రిలీజ్ కు నోచుకోలేదు. నా స్నేహితుడు వంశీ నందిపాటి “28°C” సినిమాను రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు. ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ మధ్య జరిగే ప్రేమ కథ ఇది. 28°C టైటిల్ క్వశ్చన్ మార్క్ ఎందుకు ఉంది అనేది మీరు సినిమాలో చూడాలి. ఇలాంటి కథతో మరే మూవీ థియేటర్స్ లో గానీ ఓటీటీలో గానీ రాలేదు. సినిమా క్రిస్ప్ గా, ఇంట్రెస్టింగ్ గా 2 గంటలు ఉంటుంది. అన్నారు.