ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అనే పేరు తెచ్చుకోవాలని ఉంది – “క” చిత్ర నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి

నా సినిమాతో కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలి, పదిమందికి ఉపాధి దొరకాలి, ప్రేక్షకులకు నచ్చేలా తన సినిమా ఉండాలి అన్నారు నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి. కిరణ్ అబ్బవరం హీరోగా ఆయన ప్రొడ్యూస్ చేసిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్మాతగా సినిమాల పట్ల తన ప్యాషన్ ను నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి తాజా ఇంటర్వ్యూలో తెలిపారు

నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ – కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనేది నా కోరిక. వాళ్లు పేరు తెచ్చుకున్న తర్వాత ఫలానా ప్రొడ్యూసర్ మాకు అవకాశం ఇచ్చారని చెప్పుకుంటే చాలు. నాకు ఇందులో డబ్బులు సంపాదించాలని కాదు. నా సినిమా కోట్ల మంది చూశారనే సంతృప్తి ఎంతో విలువైనదిగా భావిస్తా. “క” సినిమా కథ విన్నప్పుడు కంటెంట్ చాలా కొత్తగా ఉంది అనిపించింది. ఇందులో సస్పెన్స్, సెంటిమెంట్ ఉన్నాయి. చివరలో చిన్న చిన్న డైలాగ్స్ తో ఎంతో అర్థాన్నిచ్చేలా మాటలు రాసుకున్నారు. ఇద్దరు దర్శకులు సుజీత్, సందీప్ స్క్రిప్ట్ బాగా నెరేట్ చేశారు. వాళ్లు చెబుతుంటే బాగా చేయగలరు అనే నమ్మకం కుదిరింది. హీరో కిరణ్ అబ్బవరం కష్టపడే తత్వం ఉన్న హీరో. చాలా మంచివాడు. “క” సినిమాకు ఎంతో శ్రమించి వర్క్ చేశాడు. “క” సినిమా ఔట్ పుట్ చూసి ఇంప్రెస్ అయ్యాను. 350కి పైగా థియేటర్స్ లో క రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం నాలుగు కథలు విన్నాను. మా సంస్థ నుంచి కొత్త ప్రాజెక్ట్ జనవరిలో ఫైనల్ చేస్తాను. అన్నారు.