“డ్రింకర్ సాయి” సినిమాతో టాలీవుడ్ కు పరిచయమవుతోంది జమ్మూ కాశ్మీర్ బ్యూటీ ఐశ్వర్య శర్మ. చిన్నప్పటి నుంచే నటన మీద ఆసక్తి ఉన్న ఈ యంగ్ హీరోయిన్ “డ్రింకర్ సాయి” సినిమాలో భాగి క్యారెక్టర్ లో కనిపించనుంది. ధర్మ హీరోగా నటించిన ఈ సినిమాను డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి రూపొందించారు. ఈ నెల 27న “డ్రింకర్ సాయి” సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలతో పాటు “డ్రింకర్ సాయి” విశేషాలు తెలిపింది హీరోయిన్ ఐశ్వర్య శర్మ.
ఐశ్వర్య శర్మ మాట్లాడుతూ – నాతో పాటు మా ఫ్యామిలీకి కూడా తెలుగు మూవీస్ ఇష్టం. నేను తెలుగు సినిమా చేస్తున్నానంటే మా వాళ్లు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. “డ్రింకర్ సాయి”లో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. తొలి చిత్రంతోనే కథలో బలమైన క్యారెక్టర్ దొరకడం సంతోషంగా ఉంది. నేను భాగీ పాత్రలో కనిపిస్తా. తనొక మెడికల్ స్టూడెంట్. భాగి స్ట్రిక్ట్ గా ఉంటుంది, రఫ్ అండ్ టఫ్ గా ఆన్సర్ ఇస్తుంది, అలాగే తన పాత్రతో ఫన్ కూడా క్రియేట్ అవుతుంది. ఈ పాత్ర చేయడం ఛాలెంజింగ్ గా తీసుకున్నా. హీరో ధర్మ, డైరెక్టర్ కిరణ్ బాగా సపోర్ట్ చేశారు. “డ్రింకర్ సాయి”లో కొన్ని మంచి విషయాలు చెబుతున్నాం. ట్రైలర్ చూసి మూవీని డిసైడ్ చేయకండి. థియేటర్ లో చూస్తే మూవీని ఎంజాయ్ చేస్తారు. అర్జున్ రెడ్డికి, డ్రింకర్ సాయి సినిమాలకు సంబంధం లేదు. నాకు ధనుష్ అంటే ఇష్టం. తెలుగులో మరిన్ని మంచి మూవీస్ చేయాలనుకుంటున్నా. అని చెప్పింది.