ట్రెండ్ చూస్తే ‘అరి’ బ్లాక్ బస్టర్ అయినట్లే

ఇండియన్ మైథాలజీ (Indian mythology)కి ఎంతో ప్రత్యేకత ఉంది. మన పౌరాణికాలు, ఇతిహాసాల్లో ఇవాళ సమాజానికి కావాల్సిన మంచిని కూడా వేల ఏళ్ల కిందటే చెప్పారు. అందుకే మైథాలజీ ఆధారంగా తెరకెక్కే సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. అది లేటెస్ట్ ట్రెండ్ కూడా అయ్యింది. కార్తికేయ 2 (Karthikeya 2) లో కృష్ణ తత్వాన్ని, కాంతార (Kantara)లో పంజుర్లీ దేవత గొప్పదనం, హనుమాన్ (Hanuman) లో ఆంజనేయుడి శక్తిని, ఓ మై గాడ్ లో శివుడి రాకనూ చూపించారు. రీసెంట్ గా కల్కి (Kalki 2898AD)లో మహాభారతం, అందులోని అర్జునుడు, శ్రీకృష్ణుడు, కర్ణుడి, అశ్వత్థామ పాత్రలను తెరపై ఆవిష్కకరించారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ లో రాబోతోంది అరి మూవీ.

అరి (Ari movie) మూవీలో అరిషడ్వర్గాలు, శ్రీకృష్ణుడి గొప్పతనం వంటి అంశాలతో తెరకెక్కిన ‘అరి’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అరిషడ్వార్గాలను కాన్సెప్ట్ గా తీసుకుని ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద సినిమా రాలేదు. దీంతో ‘అరి’ సినిమాపై అందరిలో ఆసక్తి ఏర్పడుతోంది. మైథాలజీ బ్యాక్ డ్రాప్ సూపర్ హిట్ సినిమాల్లాగే ‘అరి’ మూవీ మీద భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రాన్ని “పేపర్ బాయ్” చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు జయశంకర్ (Jayashankar) రూపొందిస్తున్నారు. ‘అరి’ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. ‘అరి’ సినిమా హిందీ రీమేక్ పై బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.