ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

వ్యూహం సినిమాను ప్రదర్శించిన నెపంతో 2 కోట్ల రూపాయల మేర అక్రమంగా సంపాదించుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు పంపించింది. ఏపీ ఫైబర్ నెట్ లో వ్యూహం సినిమాను ప్రదర్శించడం ద్వారా ఒక్కో వ్యూస్ కు 11 వేల రూపాయల చొప్పున అక్రమంగా అప్పటి ప్రభుత్వం చెల్లించిందని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ వర్మకు ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది.

వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్, లోకేష్ ను విమర్శిస్తూ సినిమాలు తీశారు రామ్ గోపాల్ వర్మ. అందుకు గాను ప్రభుత్వం నుంచి అక్రమంగా డబ్బులు తీసుకున్నారు. దీనిపై ఇప్పుటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్మను చట్టప్రకారమే శిక్షించాలని ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.