దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న అనుష్క తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది. కానీ తొలిసారి ఆమె మలయాళ సినిమాలో నటిస్తోంది. కథనార్, ది వైల్డ్ సోర్సెరర్ పేరుతో ఈ సినిమాను దర్శకుడు రోజిన్ థామస్ రూపొందిస్తున్నారు. జయసూర్య హీరోగా నటిస్తున్న కథనార్, ది వైల్డ్ సోర్సెరర్ సినిమా గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ హాంటింగ్ విజువల్స్ తో ఆడియెన్స్ ను భయపెట్టేలా ఉంది.
ఈ చిత్రాన్ని శ్రీ గోకులం మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది. చారిత్రక అంశాల నేపథ్యంతో హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న కథనార్ ది వైల్డ్ సోర్సెరర్ సినిమా 15 భాషల్లో రిలీజ్ కాబోతుండటం విశేషం. వర్చువల్ ప్రొడక్షన్ పద్ధతితో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రమిదే. ఈ సినిమాతో మలయాళంలో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తోంది అనుష్క. ఆమె క్యారెక్టర్ గతంలో తెలుగులో వచ్చిన అరుంధతి పాత్రలా ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది కథనార్, ది వైల్డ్ సోర్సెరర్ సినిమా రిలీజ్ కానుంది.