రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ఫౌజీలో జాయిన్ అయ్యారు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్. ఈ దిగ్గజ నటుడు ప్రభాస్ తో పాటు టీమ్ తో తీసుకున్న ఫొటోస్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. తన 544వ సినిమా ఇండియన్ సినిమా బాహుబలి ప్రభాస్ తో కలిసి సినిమా చేస్తుండటం సంతోషంగా ఉందంటూ అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. అలాగే దర్శకుడు హను రాఘవపూడి చాలా ప్రతిభావంతుడని అనుపమ్ పేర్కొన్నారు.
రెండో ప్రపంచయుద్ధ నేపథ్యంగా సాగే ప్రేమ కథతో యాక్షన్ డ్రామాగా ఫౌజీ రూపొందుతోంది. కొత్త నాయిక ఇమాన్వి ప్రభాస్ సరసన స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమా హైదరాబాద్ లో షెడ్యూల్ ప్రారంభించుకోనుంది.