మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డ్

అక్కినేని నాగేశ్వరరావు(ANR) శతజయంతి సందర్భంగా ఈసారి ఆయన పేరుతో ప్రతి రెండేళ్లకు ఇస్తున్న అవార్డ్ ను మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి అందిస్తామని ప్రకటించారు హీరో నాగార్జున(Nagarjuna). ఏఎన్నార్ శతజయంతి కార్యక్రమంలో నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించారు. అక్టోబర్ 28వ తేదీన బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitab bachan) చేతుల మీదుగా చిరంజీవికి ఏఎన్నార్ పురస్కార ప్రదానం చేస్తామని నాగార్జున తెలిపారు. ఈ అవార్డ్ విషయం చెప్పగానే చిరంజీవి తనను హగ్ చేసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారని నాగార్జున అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ – ప్రతి రెండేళ్ళకు ఏఎన్ఆర్ అవార్డ్ ఇస్తున్నాం. ఈ ఏడాది ఏఎన్ఆర్ అవార్డ్ చిరంజీవి గారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం చెప్పగానే చిరంజీవి గారు చాలా ఎమోషనల్ హాగ్ చేసుకొని ఏఎన్ఆర్ గారి శత జయంతి ఏడాదిలో ఇవ్వడం చాలా ఆనందంగా వుందని చెప్పారు. దీనికి కంటే పెద్ద అవార్డ్ లేదని అన్నారు. అమితాబ్ బచ్చన్ గారు ఆవార్డ్ ప్రధానం చేస్తారు. అక్టోబర్ 28 ఈ ఫంక్షన్ చేస్తున్నాం. అన్నారు.