సలార్ లో మరో పాన్ ఇండియా స్టార్..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ, క్రేజీ మూవీ సలార్. ఇందులో ప్రభాస్ కు జంటగా శృతి హాసన్ నటిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో సలార్ టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులు నుంచి సలార్ లో మరో పాన్ ఇండియా స్టార్ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఎవరా పాన్ ఇండియా స్టార్ అనుకుంటున్నారా.? కేజీఎఫ్ తో సంచలనం సృష్టించిన రాఖీభాయ్ యశ్.

అవును.. యశ్ సలార్ లో గెస్ట్ రోల్ చేస్తున్నాడని.. ఈ మూవీ క్లైమాక్స్ లో కనిపిస్తాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో సలార్ ట్రెండింగ్ లో నిలిచింది. అటు ప్రభాస్ అభిమానులు, ఇటు రాఖీ భాయ్ అభిమానుల్లో దీని గురించే చర్చ జరుగుతుంది. ఇది నిజమో కాదో తెలియదు కానీ.. ఇండియా వైడ్ ఇది హాట్ టాపిక్ అయ్యింది. ప్రచారంలో ఉన్నట్టుగా సలార్ లో రాఖీ భాయ్ కనిపిస్తే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. మరి.. ప్రశాంత్ నీల్ ఏం చేస్తాడో చూడాలి.