మహేశ్ బాబు నటిస్తున్న కొత్త సినిమా గుంటూరు కారం నుంచి మరో న్యూస్ బయటకొచ్చి వైరల్ అవుతోంది. ఈ సినిమా నుంచి పూజా హెగ్డే మొదట పూజా హెగ్డే వెళ్లిపోవడమే పెద్ద నెగిటివ్ న్యూస్ అవగా…ఆ తర్వాత డేట్స్ కారణంగా సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ వాక్ ఔట్ అయ్యారు. ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కూడా గుంటూరు కారం నుంచి బయటకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
షెడ్యూల్స్ లో ప్లానింగ్ లేకపోవడం వల్ల బిజీగా ఉండే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఈ సినిమాకు పనిచేయడం కుదరడం లేదన్నది కారణంగా తెలుస్తోంది. వీళ్లే కాదు సాధారణంగా ఇలాంటి పెద్ద చిత్రాలకు పనిచేసే టెక్నీషియన్స్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ సినిమాలు చేస్తున్నారు. డేట్స్ పదే పదే మార్చుకోవడం వాళ్లకు ఇబ్బందిగా మారుతోంది. ఈ కారణంగానే అప్పుడు సినిమాటోగ్రాఫర్ ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ గుంటూరు కారం సినిమాకు గుడ్ బై చెప్పారట.
మొదటి నుంచీ ఈ సినిమాకు ఏదీ ప్లానింగ్ ప్రకారం జరగడం లేదు. అసలు మొత్తం స్క్రిప్ట్ నే మహేశ్ వద్దన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. సినిమానే ఉండదనే దాకా ఈ న్యూస్ వెళ్లింది. బర్త్ డే కు ముందు మహేశ్ ఈ సినిమా నుంచి వెకేషన్ కు వెళ్లిపోవడం కూడా ఏదో అప్ సెట్ అవుతోందనే వార్తలకు అవకాశం కల్పించింది. ఏది ఏమైనా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ సినిమా నుంచి వెళ్లిపోయిన విషయం అఫీషియల్ గా టీమ్ వెల్లడించాల్సిఉంది