మాస్ మహారాజా రవితేజ, క్రేజీ హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ ధమాకా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించింది. అయితే.. వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన మలినేని గోపీచంద్.. రవితేజతో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి కథాచర్చలు జరుగుతున్నాయి. రవితేజను ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా సరికొత్తగా చూపించనున్నాడని సమాచారం.
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం ధమాకా హీరోయిన్ శ్రీలీలనే ఫైనల్ చేశారట. రవితజ, శ్రీలీల జంట ధమాకా మూవీలో బాగా ఎంటర్ టైన్ చేశారు. మరోసారి ఈ జంట తెర పై కనిపించనుందని తెలిసినప్పటి నుంచి సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్ మీదకు వెళ్తుంది. మళ్లీ దాదాపుగా క్రాక్, వీరసింహారెడ్డి టెక్నికల్ టీమ్ నే దీనికీ పని చేస్తుందని టాక్ వినిపిస్తుంది. వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన మలినేని గోపీచంద్ మరో సక్సెస్ కోసం అదిరిపోయే స్టోరీ రెడీ చేశాడట. మరి.. రవితేజ ఆశిస్తున్న సక్సెస్ ను మలినేని గోపీచంద్ అందిస్తాడేమో చూడాలి.