బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 మూవీలో నటిస్తున్నాడు. డైరెక్టర్ బోయపాటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుథ్ ని తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని త్వరలో అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం. బాలకృష్ణ సినిమాకి థమనే మ్యూజిక్ అందిస్తుంటాడు. అలాంటిది అనిరుథ్ మ్యూజిక్ అందించనున్నాడు అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అనిరుథ్ అజ్ఞాతవాసి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో అనిరుథ్ కు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు.
ఆ తర్వాత జెర్సీ సినిమా సక్సెస్ అవ్వడంతో టాలీవుడ్ డైరెక్టర్స్ చూపు మళ్లీ అనిరుథ్ పై పడింది. ఎన్టీఆర్ దేవర సినిమాకు అనిరుథ్ మ్యూజిక్ అందించాడు. ఆ సినిమా హిట్ కావడంతో ఇప్పుడు మరింత క్రేజ్ పెరిగింది. రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించే మూవీలో బాలకృష్ణ కీలక పాత్ర పోషించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి కూడా అనిరుథే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ విధంగా బాలకృష్ణ రెండు సినిమాలకు అనిరుథే మ్యూజిక్ డైరెక్టర్ అని వార్తలు వస్తున్నాయి. ప్రచారంలో ఉన్నట్టుగా బాలకృష్ణ మూవీకి అనిరుథ్ మ్యూజిక్ అందిస్తే.. ఆ మూవీకి మరింత క్రేజ్ వచ్చినట్లే అనుకోవాలి.