స్టోరీ డిస్కషన్స్ లో చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ

మెగాస్టార్ చిరంజీవి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడితో సినిమా చేయాలని మెగాస్టార్ భావించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ పడాలంటే మంచి కాంబోలో సెట్ చేసుకోవాలనేది మెగాస్టార్ ఆలోచన. అనిల్ రావిపూడికి కూడా చిరంజీవితో సినిమా అంటే దర్శకుడిగా ప్రమోషన్ వచ్చినట్లే. ఈ కాంబో మూవీ గురించి గతంలోనే టాక్స్ జరగగా..ఇప్పుడు స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూపొందించారు. సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అనిల్ రావిపూడి పూర్తిగా మెగాస్టార్ తో చేసే సినిమా మీదే దృష్టి పెట్టబోతున్నారు. రీసెంట్ గా మెగాస్టార్ ను కలిశానని, స్క్రిప్ట్ ఎలా ఉండాలో మాట్లాడుకున్నామని అనిల్ రావిపూడి తెలిపారు. ఓ మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ వీరి కాంబోలో రాబోతోంది.