మరోసారి జోడీగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంట బేబీ సినిమాతో సూపర్ హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడీ జోడీ మరోసారి కలిసి కనిపించనున్నారు. ఆనంద్, వైష్ణవి హీరో హీరోయిన్లుగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాను 90 మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ రూపొందిస్తున్నారు. 90 మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ కు కొనసాగింపుగా ఈ సినిమా నేపథ్యం ఉండనుంది.

ఈ రోజు ఈ సినిమా అనౌన్స్ మెంట్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో ఆనంద్ దేవరకొండ స్పందిస్తూ.. మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ అబ్బాయి లవ్ స్టోరీని థియేటర్స్ లో చూడండి. ఇది మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ. అని చెప్పారు. 90 మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ కథ పదేళ్ల తర్వాత ఎలా కొనసాగుతుంది అనేది ఈ సినిమాలో ఉండనుంది.