సుహాస్ హీరోగా నటించిన “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా ఒక మంచి ప్రయత్నంగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సినిమా తాజాగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ లో క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీగా అవార్డ్ గెల్చుకుంది. హీరో సుహాస్, హీరోయిన్ శివానీ, నిర్మాత ధీరజ్ మొగిలినేని, దర్శకుడు దుశ్యంత్ కటికినేని సాక్షి అవార్డ్స్ వేదికపై అవార్డ్ స్వీకరించారు.
సమాజంలోని చిన్నా పెద్ద తేడాలు ఎలా ఉంటాయి, డబ్బు లేకున్నా పేదవారు ఆత్మాభిమానానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారు అనే అంశాలతో మంచి ప్రేమకథగా రూపొందిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా థియేటర్ తో పాటు ఓటీటీలోనూ ఆకట్టుకుంది.
“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు.