జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్

ఇవాళ ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డ్ ను సొంతం చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాలో నటనకు గానూ ఆయనకు ఈ అవార్డ్ దక్కింది. తెలుగు సినిమా చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ ఓ తెలుగు నటుడికి దక్కడం ఇదే తొలిసారి. ఇలా కొత్త చరిత్ర సృష్టించాడు అల్లు అర్జున్. 2021 లో రిలీజైన పుష్ప లో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటన, హావభావాలు, మేనరిజమ్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.

ఉత్తమ నటి అవార్డును గతేడాది సూర్య, అజయ్ దేవగణ్ పంచుకుటే ఈసారి గంగూభాయి కథియావాడి చిత్రానికి ఆలియా భట్, మిమి సినిమాలో నటనకు కృతి సనన్ కలిసి దక్కించుకున్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఛెల్లో షో (గుజరాతీ) ఎంపికైంది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పుష్ప సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అవార్డ్ గెల్చుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన అవార్డ్ గెల్చుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉత్తమ కొరియోగ్రఫీ (నాటు నాటుడు – ప్రేమ్ రక్షిత్), విజువల్ ఎఫెక్ట్స్ (శ్రీనివాస్ మోహన్) విభాగాల్లో రెండు అవార్డులు దక్కాయి.