పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించేందుకు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ వెంట నిర్మాత దిల్ రాజు కూడా వెళ్లారు. కిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు అల్లు అర్జున్ ను కలిసి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి వివరించారు.
శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో అల్లు అర్జున్ మాట్లాడారు. శ్రీతేజ్ కు అవసరమైన మెరుగైన వైద్య చికిత్సను అందిస్తామనే భరోసాను అల్లు అర్జున్ భాస్కర్ కు ఇచ్చారు. అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వచ్చిన సందర్భంగా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. అభిమానులు ఎవరూ ఆస్పత్రి వద్ద గుమిగూడకుండా చూశారు.