అల్లు అర్జున్ త్రివిక్రమ్ ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరు కలిసి చేసిన గత మూడు సినిమాలు సక్సెస్ అయ్యాయి. హ్యాట్రిక్ సినిమా అల వైకుంఠపురములో ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది. అందుకే వీరి కాంబినేషన్ లో రాబోతున్న నాలుగో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. ఈ సినిమాను హారికా హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
లేేటెస్ట్ అప్ డేట్ ప్రకారం అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా డిసెంబర్ నుంచి బిగిన్ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేశ్ హీరోగా గుంటూరు కారం సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. డిసెంబర్ లోగాా గుంటూరు కారం వర్క్స్ మొత్తం ఫినిష్ చేసుకోనున్న త్రివిక్రమ్..అల్లు అర్జున్ మూవీకి రంగంలోకి దిగుతారు.
మరోవైపు అల్లు అర్జున్ కూడా తన పుష్ప 2 మూవీ షూటింగ్ ఆ టైమ్ కు కంప్లీట్ చేసుకుంటారు. పుష్ప 2 వచ్చే ఆగస్టు 15న రిలీజ్ డేట్ పెట్టుకుంది. ప్రీప్రొడక్షన్ పనులకు రెండు నెలలు టైమ్ కేటాయించినా..వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా అల్లు అర్జున్ , త్రివిక్రమ్ ప్రాజెక్ట్స్ సెట్స్ మీద అడుగుపెడుతుంది.