అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ – ఇప్పట్లో అసాధ్యమే

అల్లు అర్జున్, త్రివిక్రమ్ ది సక్సెస్ ఫుల్ కాంబో. వీరు ఇప్పటికి మూడు చిత్రాలు చేసి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు నాలుగో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. గీతా ఆర్ట్స్ తో కలిసి హారికా హాసినీ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మించాల్సిఉంది. అయితే ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అల్లు అర్జున్ ఇమేజ్ పెరిగింది, ఒక్కో సినిమా మేకింగ్ కు ఏళ్లకేళ్లు పడుతోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా కొన్నేళ్ల వరకు సాధ్యం కాకపోవచ్చు.

ప్రస్తుతం అల్లు అర్జున్ కు ఉన్న భారీ లైనప్ ఇందుకు కారణం. అట్లీతో నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. దీని తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో సినిమా టాక్స్ లో ఉంది. ఈ రెండు కాకుండా పుష్ప 3 క్యూలో ఉంది. ఈ మూడు సినిమాలకు ఒక్కోటి రెండేళ్లు టైమ్ తీసుకున్నా కనీసం ఆరేళ్లు వీటికే పడుతుంది. ఇక త్రివిక్రమ్ సినిమా ఎప్పటికి కుదురుతుంది అనే టాక్ వినిపిస్తోంది. ప్రాక్టికల్ గా ఇలా ఉంటే ప్రొడ్యూసర్ నాగవంశీ మాత్రం అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని చెబుతున్నారు.