సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ తో కొలాబ్రేట్ అయ్యారు హీరో అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో ఒక వీడియో షూట్ చేసి ఇన్ స్టా ద్వారా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మార్నింగ్ నుంచి తన షూట్ కంప్లీట్ చేసుకుని మళ్లీ తిరిగి ఇంటికొచ్చేదాకా తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో వివరించాడు. తనకొచ్చిన అవార్డులను చూపించడం దగ్గర నుంచి ఇంట్లో తను ప్లెజెంట్ గా స్పెండ్ చేసే హాల్, గార్డెన్, యోగా ప్లేస్ వంటివి చూపించాడు. ఇంటి నుంచి పుష్ప 2 షూటింగ్ జరుగుతున్న రామెజీ ఫిలిం సిటీకి వెళ్లారు అల్లు అర్జున్.
ఫిలింసిటీలో అభిమానులను పలకరించడం, పుష్ప 2 షూట్ కోసం తానెలా మేకోవర్ అవుతున్నదీ ఈ వీడియోలో ఉంది. అలాగే పుష్ప2 షూటింగ్ లొకేషన్ ఫస్ట్ టైమ్ అఫీషియల్ గా అల్లు అర్జున్ ఇన్ స్టా వీడియో ద్వారా చూపించారు. పుష్ప రాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ వీడియోలో మైత్రీ నిర్మాతలతో పాటు దర్శకుడు సుకుమార్ ఉన్నారు. సుకుమార్ మాట్లాడుతూ అల్లు అర్జున్ తన ఫస్ట్ మూవీ హీరో కాబట్టి ఆయనతో సినిమా చేయడం ఎప్పుడూ స్పెషల్ ఫీలింగ్ ఇస్తుందని చెప్పాడు. పుష్ప 2 వచ్చే సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. వచ్చే మార్చి 22 రిలీజ్ డేట్ అనుకుంటున్నారు.