జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్

నిన్నరాత్రి చంచల్ గూడ జైల్లో గడిపిన హీరో అల్లు అర్జున్ ను ఈ ఉదయం సుమారు 7 గంటలకు జైలు అధికారులు విడుదల చేశారు. నిన్న రాత్రి 10 గంటలు దాటినా కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ కాపీలు చంచల్ గూడ జైలు అధికారులకు చేరలేదు. దీంతో రాత్రి జైల్లోనే సాధారణ ఖైదీలా గడిపారు అల్లు అర్జున్. ఆయనకు ఓ నెంబర్, బ్యారక్ కేటాయించారు.

ఈ ఉదయం బెయిల్ ఆర్డర్ ఫార్మాలిటీస్ పూర్తిచేసి విడుదల చేశారు. అనంతరం జుబ్లీ హిల్స్ లోని తన ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్. కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. భార్య స్నేహా రెడ్డి, ఇద్దరు పిల్లలు కన్నీళ్లు పెట్టుకున్నారు.