సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన తమ కంట్రోల్ లో లేదని అన్నారు హీరో అల్లు అర్జున్. ఈ రోజు మరోసారి ప్రెస్ మీట్ నిర్వహించారు అల్లు అర్జున్. బాధిత కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నానని, ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని అల్లు అర్జున్ అన్నారు. గాయపడి చికిత్స తీసుకుంటున్న మృతురాలు రేవతి కొడుకు శ్రీతేజ్ ను పరామర్శిస్తానని అల్లు అర్జున్ తెలిపారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ – నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 20 ఏళ్లుగా సంధ్య థియేటర్ లో సినిమా చూస్తున్నాను. ఆ ఘటన అనుకోకుండా జరిగింది. రేవతి కుమారుడు శ్రీ తేజని పరామర్శిస్తాను. బాధిత కుటుంబానికి క్షమాపణ చెబుతున్నా. ఒకరు చనిపోవడం దురదృష్టకరమైన ఘటన. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటా. అని అన్నారు.
మరోవైపు అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో వెళ్లారు. దిల్ రాజు, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, రాఘవేంద్ర రావు, హీరో శ్రీకాంత్, దగ్గుబాటి సురేష్ బాబు, ఉపేంద్ర పుష్ప రవి శంకర్, దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ ను కలిసి పరామర్శించారు.