అల్లు అర్జున్, అట్లీ మూవీ ప్రకటన ఆ రోజే

స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఓ భారీ చిత్రం చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ దుబాయ్ లో జరుగున్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ ప్రెస్టీజియస్ గా హ్యూజ్ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

అల్లు అర్జున్ బర్త్ డే అయిన ఏప్రిల్ 8న ఈ సినిమాను ప్రకటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అమెరికా వెకేషన్ లో ఉన్నారు. దుబాయ్ లో అట్లీ అండ్ టీమ్ తో జరిగిన జరిగిన మూవీ డిస్కషన్స్ లో పాల్గొన్న అల్లు అర్జున్ అక్కడి నుంచి యూఎస్ ట్రిప్ వెళ్లారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ డబుల్ రోల్ చేస్తారని, ఇది పునర్జన్మల నేపథ్య కథ అని పలు రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.