ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఊహించని విధంగా అరెస్ట్ అవ్వడం.. ఆతర్వాత బెయిట్ పై బయటకు రావడం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ సంఘటన నుంచి బయటపడుతున్న బన్నీ.. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయం పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఏప్రిల్ లో ఈ భారీ చిత్రాన్ని సినిమా సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
అయితే.. ఊహించని విధంగా బన్నీ.. సంజయ్ లీలా భన్సాలీని కలవడం హాట్ టాపిక్ అయ్యింది. వీరిద్దరి కలయిక గురించి గతంలో కూడా వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు బన్నీ, భన్సాలీ కలవడం పాన్ ఇండియా రేంజ్ లో హాట్ టాపిక్ అయ్యింది. భన్సాలీ లవ్ అండ్ వార్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీతో సినిమా చేయాలి అనేది భన్సాలీ ప్లాన్. బన్నీ ఇక నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేసేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కనుక ఫైనల్ అయితే.. పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ అవ్వడం ఖాయం. ఏం జరగనుందో చూడాలి మరి.