“పుష్ప 2” షూటింగ్ లో జాయిన్ అయిన అల్లు అర్జున్

నేషనల్ అవార్డ్ విన్ అయి ఆ సంతోషంలో దేశవ్యాప్తంగా సెలబ్రిటీస్ నుంచి గ్రీటింగ్స్ అందుకుంటున్నారు హీరో అల్లు అర్జున్. పుష్ప సినిమాలో నటనకు ఆయనకు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ దక్కించుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ ముగించుకున్న అల్లు అర్జున్ ఇవాళ పుష్ప 2 సెట్ లో తిరిగి జాయిన్ అయ్యారు. హైదరాబాద్ లో జరుగుతున్న పుష్ప 2 షూటింగ్ లో ఆయన పాల్గొంటున్నారు.

రామోజీ ఫిలిం సిటీలో పుష్ప 2 కొత్త షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ వేసిన ప్రత్యేక సెట్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ తో ఇతర కీ ఆర్టిస్టుల కాంబినేషన్ సీన్స్ చేస్తున్నారు. ఈ ఏడాది చివరి కల్లా పుష్ప 2 షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్లాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.

పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ తీసుకోనున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కు పుష్ప 2 విడుదల చేయాలనుకుంటున్నారు. నేషనల్ అవార్డ్స్ దక్కిన క్రేజ్ తో పుష్ప 2 పై మరింతగా భారీ అంచనాలు పెంచుతోంది.