అల్లు అర్జున్ కు బెయిల్

అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. దీంతో ఆయన జైలుకు వెళ్లే పరిస్థితి నుంచి ఉపశమనం పొందినట్లు అయ్యింది. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు చంచల్ కూడ జైలుకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో హైకోర్టులో అల్లు అర్జున్ తరుపు లాయర్లు తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.