అల్లు అర్జున్, కొరటాల కాంబో ఇప్పట్లో సాధ్యమేనా..?

అల్లు అర్జున్, కొరటాల శివ కాంబోలో మూవీ కోసం గతంలో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. డిఫరెంట్ గా ఉన్న ఆ పోస్టర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకుంటే.. ఊహించని విధంగా ఆగిపోయింది. ఆతర్వాత అటు బన్నీ, ఇటు కొరటాల వేరే ప్రాజెక్ట్స్ లో బిజీ అయ్యారు. ఇటీవల బన్నీ పుష్ప 2తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తే.. కొరటాల దేవర మూవీతో సక్సెస్ సాధించారు. బన్నీ పుష్ప 3 చేయాలి.. దీని కంటే ముందు త్రివిక్రమ్ తో మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక కొరటాల దేవర 2 చేయాలి. దీని కంటే ముందు మరో ప్రాజెక్ట్ చేయనున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

బన్నీతో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్.. కథ పై కసరత్తు చేస్తున్నారు. ఈసారి త్రివిక్రమ్ దర్శకధీరుడు రాజమౌళి కూడా టచ్ చేయని జానర్ లో సినిమా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మార్చి లేదా ఏప్రిల్ నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమా గురించి అప్ డేట్ వస్తుందని బన్నీ ఆర్మీ వెయిట్ చేస్తుంటే.. కొరటాలతో సినిమా కొత్తగా ప్రచారం మొదలైంది. అంతే కాకుండా బన్నీకి కొరటాల స్టోరీ నెరేట్ చేయడం కూడా జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ఒకవేళ బన్నీతో కొరటాల మూవీ ఓకే అయినా ఇప్పట్లో స్టార్ట్ అవ్వదు. కారణం ఏంటంటే.. త్రివిక్రమ్ తో మూవీ తర్వాత బన్నీ పుష్ప 3 చేయాలి.. ఆతర్వాత సందీప్ రెడ్డి వంగతో భారీ చిత్రం చేయాలి. ఇదంతా జరగడానికి ఐదేళ్లు పట్టచ్చు.