కొత్త లుక్ లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్

హీరో అల్లు అర్జున్ కొత్త లుక్ లో నాంపల్లి కోర్టుకు వచ్చారు. పుష్ప 2 సినిమా కోసం పొడవైన జుట్టుతో కనిపించిన అల్లు అర్జున్..తాజాగా ఆ హెయిర్ కట్ మార్చి, షార్ట్ హెయిర్ స్టైల్ చేసుకున్నారు. అల్లు అర్జున్ కొత్త లుక్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిన్న అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు అయ్యింది. రెగ్యులర్‌ బెయిల్‌కు సంబంధించి పర్సనల్‌ బాండ్స్‌ ను ఈరోజు నాంపల్లి కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట సమర్పించారు అల్లు అర్జున్. 50 వేల రూపాయల చొప్పున రెండు ష్యూరిటీలు అందజేశారు. అల్లు అర్జున్ రెండు నెలలపాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది.