రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వచ్చిన “బచ్చలమల్లి”

అల్లరి నరేష్ హీరోగా నటించిన బచ్చలమల్లి సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వచ్చింది. అమోజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ లో ఈ సినిమా నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్ 20న ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. బచ్చలమల్లి సినిమాను హాస్య మూవీస్ నిర్మించగా..సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.

థియేటర్స్ లో పెద్దగా రెస్పాన్స్ తెచ్చుకోని ఈ సినిమాకు ఓటీటీ రిలీజ్ పై కూడా క్రేజ్ లేదు. ఈ మధ్య థియేటర్స్ ఆడని మూవీస్ కూడా ఓటీటీలో ఆదరణ పొందుతున్నాయి. బచ్చలమల్లికి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందని మూవీ టీమ్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అల్లరి నరేష్ తమ కామెడీ జానర్ కు భిన్నంగా చేసిన మరో చిత్రంగా బచ్చలమల్లి రూపొందింది.