గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో అఖిల్ మూవీ

యంగ్ హీరో అఖిల్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేయాలి అనుకున్నాడు కానీ.. సినిమా సినిమాకి గ్యాప్ వస్తూనే ఉంది. ఆయన గత సినిమా ఏజెంట్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. నెక్ట్స్ మూవీ కోసం అఖిల్ చాలా కథలు విని రెండు కథలు ఫైనల్ చేశాడని తెలిసింది. అందులో ఒక కథ చెప్పింది వినరో భాగ్యము విష్ణు కథ డైరెక్టర్ మురళీ కృష్ణ అబ్బూరు. ప్రస్తుతం ఇతని డైరెక్షన్ లోనే అఖిల్ సినిమా చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

అఖిల్ యు.వీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేయాలి అనుకున్నాడు. ఇది భారీ సోషియో ఫాంటసీ మూవీ. అనిల్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా కథ రెడీ చేశాడు. అయితే.. యువీ క్రియేషన్స్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర అనే సినిమా చేస్తుంది. ఇది భారీ బడ్జెట్ మూవీ. ఈ సినిమా రిలీజ్ తర్వాత అఖిల్ తో కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలి అనేది ప్లాన్. విశ్వంభర మూవీ ఏమో ఆలస్యం అవుతుంది. ఈ కారణంగానే అఖిల్ యువీ బ్యానర్ లో చేయాలి అనుకున్న సినిమాను ప్రస్తుతానికి పక్కనపెట్టి.. ప్రస్తుతం మురళీకృష్ణ అబ్బూరుతో సినిమా చేస్తున్నాడు. అఖిల్ మరో కథను కూడా ఓకే చేశాడని.. అది గౌతమ్ మీనన్ చెప్పిన స్టోరీ అని సమాచారం. నాగచైతన్య గౌతమ్ మీనన్ తో ఏమాయ చేసావే సినిమాలో నటించి మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు అఖిల్ కూడా అలాంటి సక్సెస్ ఈ తమిళ డైెరెక్టర్ నుంచి ఆశిస్తున్నాడు.