నాగ చైతన్య, అఖిల్ ఇప్పుడు తమ కెరీర్ లోనే భారీ చిత్రాలు చేస్తున్నారు. నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి తెరకెక్కించిన తండేల్ ఫిబ్రవరి 7న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో.. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన మూడు పాటలు బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో తండేల్ సినిమా పై మరింతగా క్రేజ్ పెరిగింది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే చైతూ నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేశాడు. విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో చైతన్య సినిమాను అనౌన్స్ చేశాడు. తండేల్ రిలీజ్ తర్వాత నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.
అఖిల్ ఏజెంట్ రిలీజై దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది. ఇటీవల అఖిల్ కొత్త సినిమాను సైలెంట్ గా సెట్స్ పైకి తీసుకువచ్చాడు. వినరో భాగ్యము విష్ణు కథ డైరెక్టర్ మురళీకృష్ణ అబ్బూరు డైరెక్షన్ లో అఖిల్ ఓ మూవీ చేస్తున్నాడు. ఈ క్రేజీ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం. ఈ మూవీ తర్వాత యు.వీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేయనున్నాడు. ఇది భారీ బడ్జెట్ సినిమా. ఇలా చైతన్య, అఖిల్ ఇద్దరూ తమ భారీ చిత్రాలతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.