ప్రేమ కోసం అఖిల్ యుద్ధం

యంగ్ హీరో అఖిల్ కొత్త సినిమాకు లెనిన్ టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా లెనిన్ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. నాగార్జున నిర్మాత. అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణు కథ సినిమా రూపొందించిన దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు లెనిన్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

రాయలసీమ నేపథ్యంతో సాగే ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అఖిల్ మేకోవర్ పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది. అఖిల్ రాయలసీమ యాసను ఆకట్టుకునేలా మాట్లాడినట్లు ఈ గ్లింప్స్ తో తెలుస్తోంది. ప్రేమను మించిన పెద్ద యుద్ధం మరొకటి లేదనే క్యాప్షన్ చూస్తే ఇదొక ఇంటెన్స్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాకు ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా అఖిల్ సైలెంట్ గా షూటింగ్ చేస్తూ వెళ్తున్నాడు. లెనిన్ ఫస్ట్ సక్సెస్ ఇస్తుందని అఖిల్ ఆశిస్తున్నాడు.