అయోమయంలో అఖిల్…ఏం జరుగుతోంది..?

అఖిల్(Akhil akkineni)కు కాలం కలిసి రావడం లేదు. తొలి విజయం సాధించడానికి నాలుగో సినిమా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. నాలుగోవ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో సక్సెస్ సాధించిన అఖిల్ ఆతర్వాత స్పీడు పెంచాలి అనుకున్నాడు కానీ.. ఏజెంట్ డిజాస్టర్ అవ్వడంతో మరింత స్లో అయ్యాడు. ఏజెంట్ రిలీజై సంవత్సరం దాటేసినా ఇంత వరకు కొత్త సినిమా ప్రకటన రాలేదు. ఇప్పుడు అఖిల్ కన్ ఫ్యూజన్ లో ఉన్నాడని తెలిసింది. ఇంతకీ.. ఏమైంది..?

అక్కినేని అఖిల్ కొత్త దర్శకుడు అనిల్ తో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ క్రియేషన్స్(UV creations) నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఇది భారీ సోసియో ఫాంటసీ మూవీ అని.. దీనికి ధీర అనే టైటిల్ పరిశీలనలో ఉందని ప్రచారం జరిగింది. అయితే.. ఈ సంస్థే మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర అనే సినిమా చేస్తుందనే విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ తర్వాత అఖిల్ మూవీ స్టార్ట్ అవుతాదని ఇండస్ట్రీలో వినిపించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న అఖిల్ మూవీని త్వరలో అనౌన్స్ చేసి జనవరి లేదా ఫిబ్రవరిలో సెట్స్ పైకి తీసుకురావాలి అనుకున్నాటరట కానీ.. ఇప్పుడు అఖిల్ ప్లాన్ మారిందని తెలిసింది.

అఖిల్.. కోసం వినరో భాగ్యము విష్ణు కథ సినిమా తీసిన డైరెక్టర్ మురళీకృష్ణ అబ్బూరు(Murali krishna abburu) ఓ కథ రెడీ చేశాడట. ఆ కథ నాగార్జున టీమ్ కు బాగా నచ్చిందట. ఈ మూవీకి లెనిన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. అయితే.. ముందుగా ధీర చేసి ఆతర్వాత లెనిన్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు అఖిల్ లెనిన్ ముందు చేసి ఆతర్వాత ధీర చేద్దామా అనే ఆలోచనలో పడ్డాడని వినిపిస్తోంది. ధీర కోసం పొడవాటి హెయిర్, గెడ్డం పెంచాడు. ఈ లుక్ తోనే లెనిన్ చేస్తాడా..? లేక లేనిన్ కోసం లుక్ మారుస్తాడా..? అనేది ఆసక్తిగా మారింది. త్వరలోనే అఖిల్ సినిమాల గురించి క్లారిటీ ఇస్తాడని అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి.. అఖిల్ ఏం చేస్తాడో చూడాలి.