సంక్రాంతికి బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకీ సంక్రాంతికి వస్తున్నాం, చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఈ మూడు సినిమాలతో పాటు కోలీవుడ్ స్టార్ అజిత్ విడాముయర్చి మూవీ కూడా రిలీజ్ కానుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ మూడు సినిమాలకు ఎంతో కొంత అజిత్ మూవీ నుంచి పోటీ ఉంటుందని వార్తలు వచ్చాయి.
ప్రధానంగా తమిళనాడులో గేమ్ ఛేంజర్ మూవీకి అజిత్ మూవీ నుంచి గట్టి పోటీ ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అజిత్ మూవీ పోటీ నుంచి తప్పుకుంది. అజిత్ మూవీ పోటీలో ఉంటే.. ఒక్క తమిళనాడులోనే కాదు.. కేరళలో కూడా గట్టి పోటీ ఎదుర్కొవాల్సి వచ్చేది. అయితే.. ఇప్పుడు ఈ మూవీ కొన్ని కారణాల వలన పోటీ నుంచి తప్పుకుందని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అనేది ప్రకటిస్తామన్నారు. ఇది గేమ్ ఛేంజర్ మూవీకి ప్లస్ అని చెప్పచ్చు.